కంకిపాడు: గంజాయి తరలిస్తున్న ఆరుగురు ముద్దాయిలు అరెస్టు

సీలేరు నుండి గంజాయిని తరలించి ఈడుపుగల్లులోని పామాయిల్ తోటలో విక్రయిస్తుండగా, సీలేరుకు చెందిన కిముడు శంకర్ తోపాటు కృష్ణా జిల్లాకు చెందిన మరో ఐదుగురిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 6 కేజీల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని సీఐ మురళీకృష్ణ అభినందించారు.

సంబంధిత పోస్ట్