కంకిపాడులో అల్లుడి దాడిలో మామ తిరువీధి నాగరాజు మృతి చెందారు. దావాజీగూడెంకు చెందిన నాగరాజు తన కుమార్తె రేణుకను కోలవెన్నుకు చెందిన లాం అవినాష్‌తో వివాహం చేశారు. గర్భవతి అయిన రేణుకను ఆసుపత్రికి తీసుకెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, అవినాష్‌తో వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో అల్లుడు అవినాష్, చెక్క పీటతో మామ నాగరాజుపై దాడి చేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన నాగరాజును ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.