ఈనెల 11వ తేదీన తాడిగడపకు చెందిన విమలకేత తన తల్లితో కలిసి కారులో పోరంకి వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న మరో కారు మితిమీరిన వేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారి కారు పంటకాల్వలోకి పల్టీ కొట్టడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.