బుధవారం నూతక్కిలోని తన కుమార్తె వద్దకు వెళ్లిన పెనమలూరు నియోజకవర్గం కానూరుకు చెందిన నున్న సోమయ్య (60) దుగ్గిరాల వెళ్తుండగా, దుగ్గిరాల వద్ద బకింగ్హామ్ కాలువలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఒడ్డున లభించిన చొక్కా, ఫోన్ నంబర్ల ఆధారంగా బంధువులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.