పెనమలూరు: 'ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి'

ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం తాడిగడప గ్రామంలోని కార్మిక నగర్ కట్ట-2 వద్ద 'సుపరిపాలనకు తొలిఅడుగు' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన హామీల్లో భాగంగా 'తల్లికి వందనం' పథకాన్ని అందించి విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్