సినీ నటుడు కోటా శ్రీనివాసరావు మరణించిన విషయం తెలిసిందే. 1942, జులై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. ఆయన తండ్రి కోటా సీతారామాంజనేయులు వైద్యుడు. బాల్యం నుంచి కోటాకు నాటకాలంటే ఆసక్తి. సినిమాలలోకి రాక ముందు ఆయన స్టేట్ బ్యాంక్లో పనిచేసేవారు. 1966లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు. ఈయనకి ఇద్దరు కూతుర్లు, కుమారుడు. 1999-2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.