పెనమలూరు: డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

తాడిగడప మున్సిపాలిటీ కానూరు నందు డ్రైనేజీ నిర్మాణా పనులను గురువారం ఉదయం పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో కానూరులోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ వాటర్ బయటకు వెళ్లేలా ఈ పనులు చేపట్టినట్టు తెలిపారు. నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్