పెనమలూరు: ఇళ్ల కూల్చివేతపై ఆగ్రహం

పెనమలూరు నియోజకవర్గం, తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని కానూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి పేదల ఇళ్లను కూల్చివేసిన ఘటనపై వైసీపీ ఇంచార్జి చక్రవర్తి తీవ్రంగా స్పందించారు. ముందస్తు సమాచారం లేకుండా, అర్ధరాత్రి సమయంలో దాదాపు 50 గృహాలను కూల్చివేయడం దారుణమని ఆయన అన్నారు. బాధితులతో మాట్లాడి, వారికి అండగా ఉంటామని చక్రవర్తి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్