కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, పెనమలూరు ఎస్‌ఐ ఉషా రాణి మరియు సిబ్బంది తాడిగడప శ్రీనివాసనగర్ కట్ట ప్రాంతంలో పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ. 11,090 నగదు మరియు 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.