ఈ నెల 1వ తేదీ రాత్రి 10:30 గంటలకు కానూరు మురళి నగర్ లోని సర్వాణి హోటల్ పక్క సందులో నివాసముంటున్న ఒక మహిళ తన 21 ఏళ్ల కుమార్తె ఇంట్లో నుండి చెప్పకుండా వెళ్లిపోయిందని ఫిర్యాదు చేశారు. పెనమలూరు సిఐ నేతృత్వంలోని బృందాలు సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో 24 గంటల్లోనే యువతిని గుర్తించి, శుక్రవారం తల్లికి అప్పగించారు.