కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా సౌకర్యవంతమైన ప్రయాణాల కోసం నూతన రోడ్ల నిర్మాణాలను చేపడుతోందని ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ తెలిపారు. గోసాల, వణుకూరు, మద్దూరు, కాసరనేనివారిపాలెం గ్రామ ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించేందుకు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి, శనివారం శంకుస్థాపన చేసి నిర్మాణాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.