కంకిపాడు మండలం మంతెన గ్రామంలో విషాధం చోటు చేసుకుంది. వృద్ధురాలు తిరుమల స్వర్ణకుమారి(70)ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం హత్య చేశారు. దుండగులు మృతురాలి మెడకు వైరు చుట్టి, చాకుతో మణికట్టు కోసి గొలుసు, చేతి గాజులు అపహరించారు. భర్త పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య శవమై కనిపించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.