తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో చెత్తను సేకరించి తరలించడానికి పురపాలక శాఖ ఆధ్వర్యంలో రెండు అత్యాధునిక హంగులు కలిగిన వాహనాలు శుక్రవారం మున్సిపాలిటీకి చేరుకున్నాయి. ఈ వాహనాల రాకతో రోజుల కొద్ది మున్సిపాలిటీలో పేరుకుపోతున్న చెత్తను ఎప్పటికప్పుడు డంప్ యార్డ్కు తరలించే ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నారు.