మండలంలోని పాముల లంక గ్రామంలో నిర్వహిస్తున్న జూద క్రీడలపై పమిడిముక్కల సీఐ చిట్టిబాబు నేతృత్వంలో సర్కిల్ సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో 11 మంది జూదరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రూ. 47 వేల నగదు, 6 మోటర్ బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. సర్కిల్ పరిధిలో జూద క్రీడలకు పాల్పడితే సహించేది లేదని సీఐ చిట్టిబాబు హెచ్చరించారు.