తోట్లవల్లూరు: అనారోగ్యంతో వివాహిత మృతి

మండలంలోని రొయ్యూరు గ్రామానికి చెందిన పరిశే అరవింద (35) అనే వివాహిత, నాలుగు నెలల క్రితం ఇంటి పరిసరాల్లోని చిన్న కుక్క పిల్ల కరిచినప్పుడు, పెంపుడు కుక్కే కదా అని నిర్లక్ష్యం వహించింది. కేవలం టీటీ ఇంజక్షన్ మాత్రమే చేయించుకుంది. నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురవడంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. చిన్న కుక్క కాటును కూడా నిర్లక్ష్యం చేయకూడదని ఈ సంఘటన తెలియజేస్తుంది.

సంబంధిత పోస్ట్