తోట్లవల్లూరు: కృష్ణా నదిలోకి వెళ్ళవద్దని మైక్ ప్రచారం

కృష్ణా నదిలో వరద ఉద్ధృతి పెరుగుతుండడంతో లంక గ్రామాల ప్రజలను తోట్లవల్లూరు తహశీల్దార్ కుసుమ కుమారి అప్రమత్తం చేశారు. బుధవారం సాయంత్రం లంక గ్రామాల్లో మైక్ ద్వారా వరద ఉద్ధృతిని ప్రజలకు తెలియజేశారు. మూడు లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అయ్యే అవకాశం ఉండడంతో కృష్ణా నదిపైకి ఎవరూ వెళ్లొద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

సంబంధిత పోస్ట్