రెండు కార్లు పరస్పరం ఢీ

శుక్రవారం సాయంత్రం చీరాల మండలం వాడరేవు-పిడుగురాళ్లు జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన ఎనిమిదిమంది సభ్యులతో కూడిన ఒక కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా, ఎదురుగా వచ్చిన నలుగురు యువకులతో కూడిన మరో కారు వాడరేవు సమీపంలో పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చంద్రారావు, స్వామి, నందనీకి గాయాలయ్యాయి. వారిని వెంటనే చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అవుట్ పోస్టు పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్