ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్లు బుధవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా, ఉయ్యూరు టౌన్ పోలీసులు వీరమ్మ తల్లికి సారే సమర్పించే ఆనవాయితీలో భాగంగా, ఈసారి దళితుడైన హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి దంపతులకు ఆ అవకాశం దక్కింది. కులమతాలకు అతీతంగా ప్రజలు వీరమ్మ తల్లిని దర్శించుకుంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా టౌన్ స్టేషన్ సిబ్బంది వెంకటరెడ్డి దంపతులు వీరమ్మ తల్లికి సారే సమర్పించారు.