కృష్ణా జిల్లా ఉయ్యూరులో గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు దాడి చేసి పోలీసులు గురువారం పట్టుకున్నారు. 9 మంది నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 2. 52.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసిన ఉయ్యూరు పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఉయ్యూరు మండలంలో గంజాయి విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.