ఉయ్యురు: వీరమ్మ తల్లి ఉత్సవాల్లో భక్తజన సంద్రం!

ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్లు నాలుగో రోజున భక్తుల రద్దీతో కోలాహలంగా మారాయి. శనివారం సాయంత్రం వేలాది మంది భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి, ఎదురు దీపాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం సెలవు కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రభలు, డీజేలతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయ పరిసరాల్లో బంధుమిత్రులతో విందు భోజనాలు చేస్తూ అంతటా పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్