కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెద ఓగిరాల జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లోడ్ తో వెళుతున్న లారీని వెనకనుండి అతి వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్లు ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఉయ్యూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.