జూన్ 12 నుండి ప్రభుత్వం కొత్త పింఛన్ల పంపిణీకి దరఖాస్తులు స్వీకరిస్తుందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో లబ్ధిదారులు ఉయ్యూరు రూరల్, టౌన్ పరిధిలోని సచివాలయాలకు పింఛన్ల కోసం దరఖాస్తులు సమర్పించడానికి గత రెండు మూడు రోజులుగా పరుగులు తీస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారం కారణంగా పింఛన్ల విషయంలో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది.