కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామంలో గత నెలలో జరిగిన జువెలరీ షాప్ దొంగతనం కేసులో అంతర్రాష్ట్ర దొంగ గొర్రెల శ్రీనివాసరావును పశ్చిమగోదావరి జిల్లాలో అరెస్టు చేసినట్లు గన్నవరం డిఎస్పి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఉయ్యూరు పోలీస్ స్టేషన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుడి వద్ద నుంచి సుమారు 12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.