ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ల (డ్రోన్ వీడియో)

ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్లు అంబరాన్నంటాయి. గండదీపాల వెలుగులతో పట్టణ వీధులు దివ్యకాంతులను సంతరించుకున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకోవడంతో ఆలయ ప్రాంగణం జనసందడిగా మారింది. భక్తుల జయజయధ్వానాల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, దేవస్థాన సిబ్బంది పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. డ్రోన్ దృశ్యాల్లో ఉత్సవ శోభ అత్యద్భుతంగా కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్