యనమలకుదురు లంకలో గురువారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పెనమలూరు పోలీసులు సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు తహశీల్దార్ ముందు హాజరుపరిచిన వాహనానికి రూ. 10,000 జరిమానా విధించారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో అక్రమ రవాణాపై నిఘా పెంచామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.