రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పీ4' అమల్లో భాగంగా కార్యాచరణ రూపొందించడానికి నియోజకవర్గ స్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గుర్తించిన బంగారు కుటుంబాలను మార్గదర్శులతో సమన్వయపరచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.