గంపలగూడెం మండలం పెనుగొలనులో శనివారం మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల (1983-85) పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని, చదువుకునే రోజుల్లోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పదవుల్లో ఉన్న ఉద్యోగస్తులు, ఎన్నారైలు పాల్గొన్నారు. తిరువూరు నియోజకవర్గంలోని ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థుల మధ్య అనుబంధాన్ని బలపరిచింది.