గంపలగూడెం మండలం పెనుగొలను సాయిబాబా మందిరంలో గురువారం సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో గురువారం గురుపౌర్ణమి సందర్భంగా కళాకారులు, ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు ను25 మందిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ముందుగా షిరిడి సాయిబాబాకు భక్తులచే 108 బిందెల జలంతో జలాభిషేకం , దీపోత్సవం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.