గంపలగూడెంలో స్వాతంత్య్ర సమరయోధులు ఉద్ధమ్ సింగ్ వర్ధంతి

గంపలగూడెం మండలం పెనుగొలనులో గురువారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధులు ఉద్ధమ్ సింగ్ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జలియన్ వాలాబాగ్ ఊచకోతకు ప్రతీకారంగా లండన్ లో మైఖేల్ ఓ డైయ్యర్ ను తుపాకీతో కాల్చి చంపాడని ఉద్ధవ్ సింగ్ ను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసిందని సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్ కె. లింగమ్మ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్