పెనుగొలనులో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

గంపలగూడెం మండలం పెనుగొలనులో శుక్రవారం ఫ్రైడే డ్రై ‌ డే కార్యక్రమం నిర్వహించారు. వ్యాధుల గురించి ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం గా ఉంచుకోవాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సుల్తానా సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంగెపు లలిత, ఆరోగ్య సిబ్బంది పుల్లారావు, ఆరోగ్యశాఖ అధికారులు అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్