గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో సోమవారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు గరిమెళ్ళ సత్యనారాయణ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. "మాకొద్దీ తెల్ల దొరతనం", "దండాలు దండాలు భారత మాత" వంటి గీతాలు ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని కలిగించాయని గుర్తుచేశారు.