గంపలగూడెం: వీరాంజనేయస్వామిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి

గంపలగూడెం మండలం మేడూరులో వీరాంజనేయస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయన వెంట తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఉన్నారు.
ఆలయ అర్చకులు పొంగులేటికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మేడూరు గ్రామంలో పురాతనంగా ఉన్న స్వయంభుగా వెలసిన వీరాంజనేయ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.

సంబంధిత పోస్ట్