గోపాష్టమి వేడుకలు: గోవులకు భక్తితో పూజలు

తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం పెనుగొలనులో గురువారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో గోపాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు గోవులను పూజించి, బెల్లం, గడ్డి వంటి ఆహార పదార్థాలను అందించారు. శ్రీకృష్ణుడు, గోవులను పూజించే ఈ పండుగ రోజున బృందావనంలో గోవుల సంరక్షణ బాధ్యతను స్వీకరించడాన్ని గోపాష్టమిగా జరుపుకుంటారని సాయిబాబా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్