గంపలగూడెం మండలం పెనుగొలను అంగన్వాడీ కేంద్రంలో సోమవారం ఆషాడ మాసం సందర్భంగా అంగరంగ వైభవంగా గోరింటాకు వేడుకలు నిర్వహించారు. అంగన్వాడి టీచర్ కె. లింగమ్మ చిన్నారులకు వివిధ రకాలైన డిజైన్లతో చేతులపై గోరింటాకు అలంకరించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు స్థానిక సాయి బాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ గోరింటాకు ఆచార పరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని తెలిపారు.