గుండెపోటుతో తిరువూరుకి చెందిన లారీ డ్రైవర్ మృతి

నాదెండ్ల మండలం గణపవరం వద్ద ఓ కంపెనీలో పార్కింగ్ చేసిన లారీలో శుక్రవారం గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలానికి చెందిన వీరభద్రరావు అనే లారీ డ్రైవర్, లోడింగ్/ అన్‌లోడింగ్ నిమిత్తం వచ్చి లారీలో విశ్రాంతి తీసుకుంటుండగా నిద్రలోనే గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు ఎస్సై పుల్లారావు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్