గంపలగూడెం మండలం పెనుగొలనులో టీడీపీ మండల నాయకులు, సాయిబాబా కమిటీ అధ్యక్షులు నామా సత్యనారాయణ రెండవ వర్ధంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నామా సత్యనారాయణ సహకార సంఘ అధ్యక్షులు, నీటిపారుదుల సంఘం అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులుగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కుటుంబ సభ్యులు సహకారంతో అన్నదానం నిర్వహించారు.