తిరువూరు మండలంలో మంగళవారం రాత్రి ఈదురు గాలులు, భారీ వర్షం బీభత్సం సృష్టించాయి. పట్టణంలో పలుచోట్ల టెంట్లు, ఫ్లెక్సీలు, బోర్డులు కూలిపోయాయి. భారీ వర్షపాతంతో జనజీవనం స్తంభించి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పట్టణంలో వర్షం కొనసాగుతోంది.