పెండింగ్లో ఉన్న రూ. 9 కోట్లను విడుదల చేయండి: లక్ష్మణ్

చండ్రుపట్లలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు నాగరాజు ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫేస్ యాప్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని, వేతనాలు కూడా చెల్లించడం లేదని కూలీలు తెలిపారు. బడ్జెట్ నుంచి జిల్లాలో పెండింగ్లో ఉన్న రూ. 9 కోట్లను వెంటనే విడుదల చేసి కూలీలకు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్