తిరువూరు పట్టణంలోని రాజుపేట ఎస్సీ హాస్టల్‌లో కళాశాల విద్యార్థినులకు పోలీసులు గురువారం శక్తి యాప్‌పై అవగాహన కల్పించారు. జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు, తిరువూరు ఏఎస్సై లక్ష్మీ, మహిళా కానిస్టేబుల్ శిరీష ఆధ్వర్యంలో మహిళల భద్రత, పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. హాస్టల్ వార్డెన్ సంపూర్ణ కూడా పాల్గొన్నారు.