తిరువూరు: హైవేపై ప్రమాదం.. మహిళ దుర్మరణం

తిరువూరు జాతీయ రహదారిపై పంపింగ్ స్కీం వద్ద నిలిచిన ఆటోను వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వెంపాటి సత్యవతి (60) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్