విస్సన్నపేట మండలం కొర్లమండ గ్రామానికి చెందిన ఎస్సీ మహిళల వ్యవసాయ భూమి (సర్వే నెం 238/2, 297)ని మేశపాం ప్రభాకరరావు అక్రమంగా కబ్జా చేసేందుకు యత్నించారని బాధిత మహిళలు వాపోయారు. గత రెండేళ్లుగా కౌలు (రూ.1.20 లక్షలు) చెల్లించకుండా, ట్రాక్టర్ తో భూమిని దున్నే ప్రయత్నం చేశాడు. దీనిపై అడ్డుకోగా తమపై దాడి చేసి, బెదిరింపులకు పాల్పడ్డారని, అతనిపై చర్యలు తీసుకోవాలని సోమవారం అధికారులకు ఫిర్యాదు చేశారు.