గురు పౌర్ణమి పురస్కరించుకుని టీడీపీ సీనియర్ నాయకులు గోలేటి సుబ్రహ్మణ్యం విసన్నపేట మండలం నరసాపురం పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆయన ఘనంగా సత్కరించారు. గురువులు సమాజానికి వెలుగునిచ్చే మార్గదర్శకులని గోలేటి కొనియాడారు. విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించే గురువుల సేవలను ఆయన ప్రశంసించారు.