తిరువూరు లయన్స్ క్లబ్ కార్యాలయం నందు సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది. లయన్స్ క్లబ్ తిరువూరు-సమత క్లబ్ నకు 2025-26 సంవత్సరంనకు గాను అధ్యక్షులుగా కంచర్ల శశికళ, ప్రధాన కార్యదర్శిగా కొమ్మినేని సహజ, కోశాధికారిగా వసుమర్తి వెంకటరమణ, కుమారిలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు కంచర్ల ముత్య ప్రసాద్, సంకురాత్రి జనార్దన్ రావు, పసుమర్తి వెంకటేశ్వరరావు (పివి రావు) పాల్గొన్నారు.