తిరువూరు మున్సిపల్ పరిధిలో ఇంజనీరింగ్ కార్మికుల ఎఫెక్ట్. జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు, న్యాయపరమైన సమస్యలు పరీక్షించాలని కోరుతూ సమ్మెబాట పట్టిన కార్మికులు. దీంతో పట్టణంలో నల్లాల ద్వారా పూర్తిగా మంచినీటి సరఫరా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. చుక్క నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరారు.