గంపలగూడెం రూరల్ లింగాలకు చెందిన వ్యవసాయ కూలీలు మిరియాల సావిత్రి-సీతారాములుల కుమారుడు రంగారావు, గ్రూప్-2 పరీక్షల్లో విజయం సాధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. రంగారావు 2023లో హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేశారు. ఆయన ఎంపికపై పలువురు అభినందనలు తెలిపారు.