తిరువూరులో అయ్యప్ప స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఘనంగా నగరోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఊరేగింపు శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రారంభమై అయ్యప్ప స్వామి ఆలయం వరకు సాగింది. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.