గంపలగూడెం మండలంలో మారుతి షోరూంలో పనిచేస్తున్న యువతిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం బాధితురాలు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశాయి. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. దర్యాప్తు ముగిశాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.