తిరువూరలో వాసవి కన్యకా పరమేశ్వరి శోభాయాత్ర

తిరువూరులో మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం రాజుపేట నుంచి పట్టణంలోని వినాయక దేవస్థానం బైపాస్ రోడ్డు వరకు అమ్మవారి నగరోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, మంగళ వాయిద్యాలతో అలరించారు.

సంబంధిత పోస్ట్