విసన్నపేట మండలం పుట్రేల గ్రామానికి చెందిన రాజారావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఆయన కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అందజేశారు. 40 ఏళ్లుగా పార్టీకి సేవలందించిన రాజారావు వంటి కార్యకర్తలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.