విస్సన్నపేట: కోడిపందాల శిబిరాలపై పోలీసులు దాడులు

విస్సన్నపేట మండలం వేమిరెడ్డి పల్లిలో మంగళవారం కోడి పందాల శిబిరాలపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ముందస్తు సమాచారంతో మామిడి తోటలలో కోడిపందాలు నిర్వహిస్తున్న 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ₹4200 నగదు, 2 కోళ్లను స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్